Dailyhunt
Telangana: సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

Telangana: సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

వార్త 2 months ago

సంక్రాంతి పండుగను పురస్కరించుకునితెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త అందించారు. రాష్ట్రంలోని సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ను ప్రభుత్వం చెల్లించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

ఈ బోనస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.500 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్రం నుంచి ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తెలిపారు.

SIR: ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో 'SIR'

సాగునీటి విడుదల

మంగళవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో రూ.66.33 కోట్లతో నిర్మించిన 'మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని' మంత్రి ప్రారంభించారు. ఎన్నెస్పీ కాల్వ వద్ద మోటార్‌ను స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడుదల చేసిన అనంతరం.. మంచుకొండ గ్రామంలో కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..

ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్‌పామ్ సాగులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని, రాబోయే మూడేళ్లలో తెలంగాణ (Telangana) ను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దేశం ఏటా రూ. లక్ష కోట్లు వెచ్చించి విదేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకుంటోందని, భవిష్యత్తులో ఆ సంపద అంతా మన రాష్ట్ర రైతులకు దక్కాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా నూనెను సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Village Panchayats: పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha