Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలివితేటలు మామూలుగా లేవుగా.. మొబైల్ ఫోన్ కవర్‌లో మద్యం దాచి స్టేడియంలోకి!

తెలివితేటలు మామూలుగా లేవుగా.. మొబైల్ ఫోన్ కవర్‌లో మద్యం దాచి స్టేడియంలోకి!

వార్త 2 weeks ago

FIFA World Cup Fan: మెక్సికో వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) ఫుట్‌బాల్ మ్యాచ్‌లు క్రీడాభిమానులను ఎంతగానో కట్టిపడేస్తున్నాయి.

అయితే టోర్నీ నిర్వాహకులు మ్యాచ్‌లు ఎలాంటి గొడవలు లేకుండా సక్రమంగా జరిగేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా స్టేడియం ప్రాంగణంలోకి మద్యం (Alcohol) తీసుకెళ్లడం, అక్కడ తాగడంపై కఠిన ఆంక్షలు విధించారు. కానీ, ఒక ఫుట్‌బాల్ అభిమాని మాత్రం ఎవరికీ దొరక్కుండా, మందు బాబులకే మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక క్రేజీ ఐడియా వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Read Also : Jonty Rhodes Meets Nara Lokesh:నారా లోకేశ్‌తో జాంటీ రోడ్స్ భేటీ!

 That's some serious ingenuity-sneaking liquor into the stadium hidden inside a mobile phone cover!

FIFA World Cup Fan: మొబైల్ ఫోన్ బ్యాక్ కవర్‌లో లిక్కర్..!

సాధారణంగా స్టేడియంలోకి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ సిబ్బంది కఠిన తనిఖీలు చేపడతారు. బ్యాగులను, ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేవలం మొబైల్ ఫోన్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. దీనినే ఆ వ్యక్తి ప్లస్ పాయింట్‌గా మార్చుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్, సిలికాన్ మొబైల్ బ్యాక్ కవర్‌ను (Mobile Cover) ఉపయోగించాడు. ఆ కవర్ లోపల ఉన్న ఖాళీ స్థలంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని నింపేసి, దానికి ఫోన్ తగిలించి స్టేడియంలోకి ఎంటరయ్యాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడి ఫోన్‌ను చెక్ చేసినప్పటికీ.. అదొక మామూలు మొబైల్ కవర్ లాగే కనిపించడంతో లోపలికి పంపించేశారు.

గ్యాలరీలో కూర్చుని నాజిల్‌తో పెగ్గులు

ఇక సేఫ్‌గా గ్యాలరీలోకి ప్రవేశించి సీట్లో కూర్చున్న తర్వాత.. సదరు వ్యక్తి తన ఫోన్ కవర్ అంచున ఉన్న ఒక చిన్న నాజిల్ క్యాప్‌ను ఓపెన్ చేశాడు. అందులోంచి మద్యాన్ని గ్లాసులో పోసుకుని తాగుతూ హ్యాపీగా మ్యాచ్‌ను ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. అయితే, అతడు అత్యంత తెలివిగా ఫోన్ కవర్‌లో ఉన్న మద్యాన్ని గ్లాసులో పోస్తున్న దృశ్యాలను పక్కనున్న వారు గమనించి తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అది కాస్తా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ఐడియాను చూసిన నెటిజన్లు 'రూల్స్ బ్రేక్ చేయడంలో వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా', 'ఇలాంటి ఐడియాలు వీళ్లకే వస్తాయి', ‘నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ’ అంటూ ఫన్నీగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఐసీసీ రాడార్‌లో వైభవ్ సూర్యవంశీ.. లంక ప్లేయర్లతో ఫైట్.. నిషేధం తప్పదా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha