Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెల్లబంగారానికి రికార్డు ధర.. అయినా రైతుల్లో నిరాశ

తెల్లబంగారానికి రికార్డు ధర.. అయినా రైతుల్లో నిరాశ

వార్త 1 week ago

Cotton record price:వరంగల్ ఎనుమాముల మార్కెట్ పత్తి రికార్డు ధర ఈ సీజన్ లో తొలిసారిగా క్వింటాకు రూ. 9,060 రూపాయలకు చేరింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.

8,667 కాగా అంతకంటే ఎక్కువ రేటు పలకడం సంచలనంగా మారింది. సోమవారం రోజున మార్కెట్ కు 3,157 బస్తాల పత్తి రాగా నాణ్యతను బట్టి రూ. 5,000 నుంచి రూ. 9,060 వరకు ధర లభించింది. రాయపర్తి మండలం కేశపురం గ్రామానికి చెందిన జె. సంపత్ రెడ్డి 13 బస్తాల పత్తిని తీసుకురాగా క్వింటాకు రూ. 9,060 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో నమోదైన అత్యధిక ధర ఇదేనని అధికారులు తెలిపారు. ఎల్ నినో ప్రభావం వర్షాల లోటు తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గిపోవడంతో వ్యాపారులు నాణ్యమైన పత్తి కోసం పోటీ పడ్డారు. గరిష్ట ధర పెరిగినప్పటికీ పెరిగిన పెట్టుబడి ఖర్చుల వల్ల రైతుల చేతికి నికర ఆదాయం రావడం లేదు.

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో నీటి సరఫరా బంద్‌? వైరల్ వార్తపై జలమండలి క్లారిటీ!

 Record price for ‘white gold’-yet farmers are disappointed.

ధరలు ఆకాశాన్నంటినా రైతు కంట్లో కన్నీళ్లు ఎందుకు?

పంట చేతికొచ్చే సమయానికి ఎకరాకు రావాల్సిన దిగుబడి గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడి పంట కీలక దశల్లో తేమ అందలేదు. దీనికి తోడు తెగుళ్ల బెడద వల్ల కొన్ని ప్రాంతాల్లో కాయలు సరిగా రాక నాణ్యత తగ్గిపోయింది. విత్తనాలు ఎరువులు పురుగుమందులు కూలీలు సాగునీరు పంట కోత ఖర్చులను లెక్కేస్తే రైతులకు మిగిలేది చాలా తక్కువ. మార్కెట్లో ధర పెరిగినా మొత్తం ఆదాయం పడిపోవడంతో సంతోషపడాలో బాధపడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రకటించిన రూ. 8,667 మద్దతు ధర కంటే ఎక్కువ రేటు లభించినా అది అందరి రైతులకు వర్తించడం లేదు. క్షేత్రస్థాయిలో పంట నష్టపోవడమే రైతుల ప్రధాన సమస్యగా మారింది.

Cotton record price:సీసీఐ కేంద్రాల అవసరం ఉందా? వ్యాపారుల హవా వెనుక మర్మం!

మార్కెట్లో లభించే రూ. 9,060 గరిష్ట ధర ప్రతి రైతు పత్తికి లభించదని అధికారులు స్పష్టం చేశారు. పత్తి నాణ్యత తేమ శాతం రంగు చెత్త కలిసిన పరిమాణం ఆధారంగా వ్యాపారులు ధర నిర్ణయిస్తారు. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇస్తుండటంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కొత్త చర్చ మొదలైంది. ప్రైవేటు వ్యాపారులే ఎక్కువ ధరకు కొంటున్నప్పుడు సీసీఐ అవసరం ఎంతవరకు అనే సందేహాలు వస్తున్నాయి. రికార్డు ధర ఊరటనిచ్చినా దిగుబడి తగ్గిపోవడంతో రైతులకు అసలు నష్టం పూడటం లేదు. ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ల బారిన పడకుండా పంటను కాపాడుకోవడం సవాలుగా మారింది. భవిష్యత్తులో సాగు ఖర్చులు తగ్గేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Epaper: epaper.vaartha.com

NH65 హైవే ప్రయాణికులకు అదిరిపోయే తీపి కబురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha