Dailyhunt
Telugu news: TG: నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

Telugu news: TG: నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

వార్త 3 months ago

TG: శిశు విక్రయాల(Baby sales)ను అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు పలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ విక్రయాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ గుట్టలో శిశు విక్రయం జరిగింది.

పోలీసులకు ఆ శిశువు కన్న తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నలుగురు మధ్యవర్తులను అరెస్ట్ చేశారు.

Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

మహారాష్ట్ర వ్యక్తికి శిశు విక్రయం

ఆ శిశువు కన్న తల్లిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మహారాష్ట్ర (Maharashtra)లోని పుణేకు చెందిన విశాల్కు రూ.2.40 లక్షలకు శిశువును విక్రయించినట్లు పోలీసులకు ఆ కన్న తల్లి వెల్లడించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ శిశువును తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు.. పోలీసులు పుణే బయలుదేరి వెళ్లారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Telugu news: Sydney: ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha