Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో ఇకపై వర్షాలే వర్షాలు !!

తెలుగు రాష్ట్రాల్లో ఇకపై వర్షాలే వర్షాలు !!

వార్త 1 week ago

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు వేర్వేరు చక్రవాత వాయు ఆవర్తనాలు (Cyclonic Circulations) ఫ్యాన్ రెక్కల తరహాలో దట్టమైన మేఘాలను దక్షిణ భారతం వైపు లాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే అత్యంత భారీ స్థాయిలో మేఘాలు కమ్ముకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముఖ్యంగా జూన్ 22, సోమవారం సాయంత్రం నుంచి ఈ ప్రభావం తీవ్రం కానుంది. నైరుతీ రుతుపవనాలు హైదరాబాద్ వరకు విస్తరించినప్పటికీ, ఉత్తర తెలంగాణ వైపు ఇంకా పూర్తిగా ప్రవేశించలేదు. జూన్ 27 వరకు రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

రాయలసీమకు తుపాను ముప్పు.. నగరవాసులకు ట్రాఫిక్ తిప్పలు!

ఈ వాతావరణ మార్పుల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై వేర్వేరు రూపాల్లో పడనుంది. ఏపీలో రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి దాదాపు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల వాయు చక్రవాత తుపాను కారణంగా దక్షిణ రాయలసీమ ప్రాంతం వాన ధాటికి చిగురుటాకులా వణికే ప్రమాదం ఉంది. బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, దీనివల్ల జూన్ 26 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆంక్షలు విధించారు. మరోవైపు, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదవుతున్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం కురిసే వానల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు సాయంత్రం వేళల్లో త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షం.. ఐటీ ఉద్యోగులు, ప్రజలు అప్రమత్తం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha