Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు

వార్త 2 months ago

Gold Rates Today: ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా విలువైన లోహాల మార్కెట్ నిలకడగా సాగుతోంది. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉండటంతో, ధరలు ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు.

ప్రస్తుత మార్కెట్ సరళి ప్రకారం పసిడి ధరలు అత్యధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన వెండి ధరలు

తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన మార్కెట్లలో వెండి ధర ఊహించని రీతిలో దూసుకుపోయింది. కిలో వెండి ధర గరిష్ఠంగా రూ. 2,70,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు పసిడి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 1,63,090 వద్ద స్థిరపడింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,49,500 ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,320గా పలుకుతోంది. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి.

Gold Rates Today: దేశంలోని ఇతర నగరాల్లో రేట్ల తీరు

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాలలోనూ బంగారం ధరలలో ప్రాంతాన్ని బట్టి స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,63,240 ఉండగా, చెన్నైలో 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,27,300 వరకు నమోదైంది. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లోనూ మార్కెట్ పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది.

నిమిషాల్లో ఇంటికే రాఖీలు అందజేయనున్న అమెజాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha