Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెన్నెసీలో మహిళా ఖైదీకి మరణశిక్ష.. ఇంజెక్షన్ విఫలంతో నిలిపివేత

టెన్నెసీలో మహిళా ఖైదీకి మరణశిక్ష.. ఇంజెక్షన్ విఫలంతో నిలిపివేత

వార్త 3 weeks ago

Female prisoner in Tennessee : అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో క్రిస్టా పైక్‌కు విధించిన మరణశిక్ష అమలు సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శిక్ష అమలులో భాగంగా రెండుసార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా ఆమె మరణించకపోవడంతో అధికారులు ప్రక్రియను నిలిపివేశారు.

ఘటనకు గల కారణాలపై స్వతంత్ర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. 19 ఏళ్ల కొలీన్ స్లెమ్మర్‌ను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో క్రిస్టా పైక్‌కు 1996లో మరణశిక్ష విధించారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత టెన్నెసీలో ఒక మహిళకు మరణశిక్ష అమలు చేసే పరిస్థితి రావడం ఈ కేసును ప్రత్యేకంగా నిలిపింది.

H-1B Visa: భారతీయులకు గుడ్ న్యూస్.. హెచ్-1బి వీసా ఫీజుపై కీలక నిర్ణయం

 Female prisoner in Tennessee

Female prisoner in Tennessee : మరణశిక్షల అమలుపై తాత్కాలిక విరామం

క్రిస్టా పైక్‌కు ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు విఫలమైన నేపథ్యంలో టెన్నెసీ గవర్నర్ ఇతర మరణశిక్షల అమలుపైనా తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. డిసెంబరులో గ్యారీ సట్టన్‌కు అమలు చేయాల్సిన శిక్షను కూడా వాయిదా వేశారు. ఈ ఏడాది మేలో టోనీ కరూథర్స్‌ అనే ఖైదీ మరణశిక్ష అమలు సమయంలోనూ ఇంజెక్షన్‌కు సంబంధించిన సమస్య తలెత్తింది. నరం గుర్తించడంలో ఇబ్బంది రావడంతో ఆయన శిక్షను ఏడాది పాటు వాయిదా వేసినట్లు సమాచారం. తాజాగా క్రిస్టా పైక్‌ కేసుతో టెన్నెసీలో మరణశిక్ష అమలు విధానంపై మరోసారి చర్చ మొదలైంది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha