Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు డేట్ వచ్చేసింది!

టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు డేట్ వచ్చేసింది!

వార్త 3 weeks ago

TG SSC Exams:తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక అప్‌డేట్ అందించింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎస్సెస్సీ (SSC) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.

ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

School holidays: స్కూళ్లకు మార్చిలోనే సమ్మర్ హాలిడేస్?

 Here are the dates for the Class 10 examination fees!

పరీక్ష ఫీజు మరియు ఆలస్య రుసుము గడువు తేదీలు

సాధారణ ఫీజుతో పాటు ఆలస్య రుసుము చెల్లించడానికి వివిధ తేదీలను కేటాయించారు

  • అక్టోబర్ 30 నుండి నవంబర్ 18 వరకు: ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సాధారణ పరీక్ష ఫీజు రూ. 125 చెల్లించవచ్చు.
  • నవంబర్ 18 నుండి డిసెంబర్ 1 వరకు:రూ. 50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించాలి.
  • డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 14 వరకు:రూ. 200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
  • డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 28 వరకు: చివరిగా రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.

ఫీజు మినహాయింపు వివరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే దీనికోసం కొన్ని ఆదాయ పరిమితులు వర్తిస్తాయి

  • పట్టణ ప్రాంతాలు: విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 24,000 మించకూడదు.
  • గ్రామీణ ప్రాంతాలు: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 20,000 లోపు ఉండాలి.

అర్హత కలిగిన విద్యార్థులు తగిన ఆదాయ ధ్రవీకరణ పత్రాన్ని (Income Certificate) సంబంధిత పాఠశాల అధికారులకు సమర్పించి ఫీజు మినహాయింపు పొందవచ్చు.

TG SSC Exams:పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలు

  • పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) పూర్తి చేయాలి.
  • బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) అధికారిక వెబ్‌సైట్ ద్వారా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఈ ప్రక్రియను నిర్వహించాలి.
  • విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంప్రదించి గడువులోగా ఫీజు చెల్లించి, ఆఖరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందస్తుగా ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

Epaper: epaper.vaartha.com

ఏపీ టెట్ ఆన్సర్ కీ వచ్చేసింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha