Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెస్ట్ కెప్టెన్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసిన శుభ్‌మన్ గిల్

టెస్ట్ కెప్టెన్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసిన శుభ్‌మన్ గిల్

వార్త 6 days ago

Shubman Gill: భారత యువ క్రికెట్ సంచలనం, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించి చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

టెస్టుల్లో సారథిగా వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన గిల్.. కెప్టెన్ల బ్యాటింగ్ యావరేజ్ (సగటు) పరంగా క్రికెట్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గిల్ ఈ ఘనతను అందుకోవడం విశేషం.

కెప్టెన్‌గా 6వ టెస్ట్ శతకం.. వేగంగా 1000 పరుగుల క్లబ్‌లోకి..

న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ రెండో రోజు ఆటలో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన గిల్ 177 బంతుల్లో 126 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా అతనికిది 6వ టెస్ట్ సెంచరీ. ఈ అమోఘమైన ఇన్నింగ్స్ ద్వారా గిల్ కెప్టెన్‌గా తన 1000 టెస్ట్ పరుగుల మైలురాయిని దాటాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ ఘనత సాధించడం గమనార్హం.

Read also: Tilak Varma TG20 Price Medak:TG20 వేలం.. మెదక్‌కు తిలక్‌ వర్మ

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 101 మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా 1000 కంటే ఎక్కువ పరుగులు చేశారు. అయితే వారిలో సర్ డాన్ బ్రాడ్‌మన్ (99.94 సగటు) మినహా మరెవ్వరూ గిల్ కంటే ఎక్కువ సగటును కలిగి లేరు.

సంగక్కరను వెనక్కి నెట్టిన గిల్.. గవాస్కర్ సరసన స్థానం

ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు ప్రస్తుతం 82.8కి చేరింది. ఈ జాబితాలో శ్రీలంక మాజీ దిగ్గజం కుమార్ సంగక్కర (69.6 సగటు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌లో బ్రాడ్‌మన్ మినహా ఏ కెప్టెన్ కూడా 70 సగటును దాటలేకపోగా.. గిల్ ఏకంగా 82 పైగా యావరేజ్‌తో చరిత్ర సృష్టించాడు.

భారత కెప్టెన్ల విషయానికి వస్తే.. అత్యంత వేగంగా వెయ్యి టెస్ట్ పరుగులు సాధించిన భారత సారథుల జాబితాలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ (14 ఇన్నింగ్స్‌లు) తర్వాత గిల్ (15 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో నిలిచాడు.

పీకల్లోతు కష్టాల్లో ఆఫ్ఘనిస్థాన్

మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్థాన్ 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. భారత్ స్కోరుకు ఆ జట్టు ఇంకా 451 పరుగులు వెనుకబడి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

రెండో రోజు లంచ్‌కు భారత్ 475/6.. 500 పరుగుల మైలురాయికి చేరవగా టీమిండియా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha