Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG Crime: తమ్ముడిని కాపాడబోయే తరుణంలో, అన్నదమ్ములు మృతి

TG Crime: తమ్ముడిని కాపాడబోయే తరుణంలో, అన్నదమ్ములు మృతి

వార్త 4 months ago

తెలంగాణ (TG Crime) లోని, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మతిస్థిమితం లేని తమ్ముడు లేతు (27) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, అతన్ని కాపాడేందుకు అన్న జంగు (29) కూడా బావిలోకి దూకాడు.

దురదృష్టవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు బావిలో మృతి చెందారు. వీరి తండ్రి సోనేరావ్ ఈ ఘటనను గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.

Software engineer suicide : ఖైరతాబాద్‌లో విషాదం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎందుకిలా?

వివరాలు అడిగి తెలుసుకున్నారు

ఎస్సె విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొలంగూడకు చెందిన ఆత్రం సోనేరావ్క ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆత్రం జంగు (29), ఆత్రం లేతు (27), ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. లేతుకి గత 8నెలల నుండి మతిస్థిమితం సక్రమంగా లేదు. మంగళవారం శ్యాంపూర్ బుడుందేవ్ జాతరకు వెళ్లారు. అక్కడే ఇద్దరు మద్యం తాగారు. మద్యం మత్తులో నేను చస్తానని లేతు, గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకాడు.

తమ్ముడిని ఎలాగైనా కాపాడాలని వెంటనే అన్న జంగు సైతం బావిలోకి దూకాడు. ఏమైందో ఏమో తెలియదు ఇద్దరు అన్నదమ్ములు ఆ బావిలో శవమై తేలారు. అటుగా వెళ్ళిన మృతుల తండ్రి సోనేరావ్ బావి వద్దకు వెళ్లి చూడగా.. కేకలు వేస్తూ కుటుంబ సభ్యులను, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై విజయ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి శవాలను ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha