Dailyhunt
TG: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

TG: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

వార్త 2 months ago

హారాష్ట్రలోని గడ్చిరోలి (భమ్రాగఢ్ తాలూకా ఫడేవా అటవీ ప్రాంతం)లో (TG) గురువారం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకూ ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, నిన్న మరో నలుగురు హతమయ్యారు.

ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తి ప్రభాకర్. (TG) తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నివాసి అయిన ఈయన, సీపీఐ మావోయిస్టు సంస్థలో గడ్చిరోలి డివిజనల్ కమిటీ ఇన్చార్జ్, వెస్ట్ సబ్-జోనల్ బ్యూరో ఇన్చార్జ్, కంపెనీ నంబర్ 10 ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభాకర్పై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించిందంటే ఆయన ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా, మరో అధికారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటన స్థలం నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Digital Fraud Refund RBI: ఆన్‌లైన్ ఫ్రాడ్ బాధితులకు ..RBI నుంచి ₹25,000 పరిహారం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha