Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG Politics: కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగిందన్న హరీశ్ రావు

TG Politics: కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగిందన్న హరీశ్ రావు

వార్త 4 months ago

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో సుమారు 2 కోట్ల 20 లక్షల ఎకరాల మాగాణి సాగు జరిగిందని కేంద్ర ప్రభుత్వ(TG Politics) గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ఆర్థిక సర్వేలో బీఆర్ఎస్ పాలనపై సానుకూల వ్యాఖ్యలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులతో ఆయకట్టు విస్తరణ

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో సుమారు 32 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని హరీశ్ రావు తెలిపారు. ఈ చర్యల ఫలితంగానే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. సాగు అంశంపై(TG Politics) విమర్శలు చేస్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి మాట్లాడితే మంచిదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆధారాలు ఉన్నప్పటికీ నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆయన సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha