Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Thalapathy Vijay: జన నాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్?

Thalapathy Vijay: జన నాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్?

వార్త 4 months ago

మిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' విడుదలపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హెచ్.

వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవానికి సంక్రాంతి కానుకగా గత నెల, జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్న కొన్ని సన్నివేశాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

Meher Ramesh family tragedy : మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు

ఈ నెల 20న 'జన నాయగన్' విడుదల?

దీంతో ఈ వ్యవహారం మద్రాస్ హైకోర్టుకు చేరింది. సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ విచారణల తర్వాత కూడా విడుదలపై స్పష్టత రాకపోవడంతో నిర్మాతలు నష్టాలను నివారించేందుకు రాజీ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో విజయ్ (Thalapathy Vijay)సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎలాంటి కొత్త అడ్డంకులు ఎదురుకాకుండా సెన్సార్ క్లియరెన్స్ లభిస్తే, ఈ నెల 20న 'జన నాయగన్' థియేటర్లలోకి రావడం ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Telugu indie film review : 'శ్రీ చిదంబరం గారు' రివ్యూ, ఈ సింపుల్ లవ్ స్టోరీ నచ్చిందా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha