Dailyhunt
Thalapathy Vijay: సినిమాల కు విజయ్‌ గుడ్ బై

Thalapathy Vijay: సినిమాల కు విజయ్‌ గుడ్ బై

వార్త 3 months ago

ళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమాగా తెరకెక్కుతున్న 'జననాయగన్' చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది.

రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించబోతున్నారని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.

సినీ కెరీర్‌కు వీడ్కోలు

షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేయడంతో సినిమాపై హైప్ రోజురోజుకు పెరుగుతోంది. శనివారం జరిగిన ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుకలో దళపతి విజయ్ (Thalapathy Vijay) తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. కెరీర్‌లో 69వ చిత్రంగా తెరకెక్కుతున్న 'జన నాయగన్' (Jana Nayagan) సినిమానే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు.శనివారం మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన జననాయగన్ సినిమా ఈవెంట్‌లో విజయ్ మాట్లాడుతూ..

సినిమాలకు స్వస్తి చెప్పడం తనకు ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమోషనల్ అయ్యారు. 'నా ఫ్యాన్స్‌, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్‌లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్‌ బై చెబుతున్నా అని విజయ్ చెప్పుకోచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha