చనిపోయిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ఉద్యోగం కోసం లతాబాయి అనే మహిళ తన కోడలు 35 ఏళ్ల రూపాలిని మరో వ్యక్తితో కలిసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే (Thane Crime) జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జనవరి 1న కల్యాణ్ ప్రాంతంలోని వాల్ధుని వంతెన సమీపంలో తల, ముఖంపై తీవ్ర గాయాలతో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు మహిళను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
Read also: Cabbage: క్యాబేజీ తింటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
మొదట మహాత్మా ఫులే చౌక్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు కేసు నమోదు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పంపించారు. ఇదిలా ఉంటే.. ఆ మర్నాడు తన కోడలు రూపాలి (35) ఉదయం నుంచి కనిపించడం లేదని అత్త లతాబాయి (60) స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వాల్ధుని వంతెన వద్ద లభించిన మృతదేహాన్ని ఆమె చూపగా.. తన కోడలు రూపాలిగా ఆమె గుర్తించింది.

అయితే అత్త తీరుపై పోలీసులకు అనుమానం కలగడంతో ఇన్‌స్పెక్టర్ విజయ్ నాయక్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ తమదైన శైలిలో ఆమెను ప్రశ్నించగా కోడలిని హత్య కథ బయటపడింది. రైల్వే ఉద్యోగి అయిన లతాబాయి కొడుకు విలాస్.. 2025 గత సెప్టెంబర్ లో చనిపోయాడు. గ్రాట్యుటీ రూ.10 లక్షలు తనకు ఇవ్వాలని, తన మనవడికి కారుణ్య ప్రతిపాదికన ఆ ఉద్యోగంలో చేర్పించాలని లతాబాయి.. కోడలితో గొడవపడింది. ఒప్పుకోకపోవడంతో రాడ్ తో, తలపై కొట్టి రూపాలిని చంపేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:
Bengaluru Crime: గన్ కాల్చడం నేర్చుకుని భార్యను కాల్చి చంపిన భర్త?

