Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టిబెట్‌లో భారీ కొండచరియలు విరిగిపడడంతో 550 మందికి పైగా గల్లంతు!

టిబెట్‌లో భారీ కొండచరియలు విరిగిపడడంతో 550 మందికి పైగా గల్లంతు!

వార్త 3 weeks ago

Tibet Mudslide : టిబెట్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో పాటు భారీగా వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన గైరాంగ్ (Gyirong) పోర్టు నగరంపై ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపింది.

వరదలు మరియు బురద తుఫాను లాగా క్షణాల్లో విరుచుకుపడటంతో అక్కడి ప్రజలు తేరుకునే లోపే తీవ్ర నష్టం జరిగింది.

Read Also: Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. మృతుల సంఖ్య 160కి చేరిక

 Tibet Mudslide

Tibet Mudslide : ప్రధాన వివరాలు & సహాయక చర్యలు

టిబెట్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో పాటు భారీగా వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన గైరాంగ్ (Gyirong) పోర్టు నగరంపై ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. వరదలు మరియు బురద తుఫాను లాగా క్షణాల్లో విరుచుకుపడటంతో అక్కడి ప్రజలు తేరుకునే లోపే తీవ్ర నష్టం జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ముగ్గురు మృతి చెందగా, 588 మందికి పైగా గల్లంతయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గైరాంగ్ పోర్టు పరిసర ప్రాంతాల్లోని రహదారులు, భవనాలు పూర్తిగా బురదమయమయ్యాయి. ఈ హఠాత్ పరిణామానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను కాపాడటానికి, సహాయక చర్యలు అందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయక చర్యల కోసం చైనా వై-20 (Y-20) రవాణా విమానం ద్వారా ప్రత్యేక సైనిక బృందాలను ప్రమాద స్థలానికి తరలించింది. ఈ బృందాలు దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించడం మరియు సహాయక చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించాయి.

మానవాళికి ఏఐతో భారీ ముప్పు: బిల్ గేట్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha