Delhi School Student Death: దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు వినోద్ నగర్ సర్వోదయ కన్యా విద్యాలయలో తీవ్ర హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు క్లాస్ పుస్తకం తెచ్చుకోలేదనే చిన్న కారణంతో ఉపాధ్యాయురాలు వేసిన రాక్షస దండనకు పింకీ అనే 10 ఏళ్ల విద్యార్థిని బలయ్యి తీవ్ర సంచలనం సృష్టించింది.
తీవ్రమైన ఎండలో గంటల తరబడి నిలబెట్టడంతో స్పృహతప్పి పడిపోయిన చిన్నారి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
Delhi School Student Death: ఏం జరిగింది? ఉపాధ్యాయురాలి నిర్లక్ష్యంపై విచారణ

ఆగస్టు 27వ తేదీన పాఠశాలకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక పింకీ, పుస్తకం తెచ్చుకోలేదని ఉపాధ్యాయురాలు తీవ్రమైన ఎండలో మైదానంలో నిలబెట్టింది. గంటల తరబడి ఎండలోనే నిలబడటంతో చిన్నారి శరీరం తీవ్రంగా వేడెక్కి ఆరోగ్యం క్షీణించింది. మధ్యాహ్నం వేళ స్కూలు యాజమాన్యం నుంచి ఫోన్ రావడంతో పాప తల్లి అంజలి పాఠశాలకు పరుగెత్తుకెళ్లింది. అప్పటికే తీవ్రమైన నిరసనతో, క్షీణించిన ఆరోగ్యంతో కనిపిషణ చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ చిన్నారి పింకీ కన్నుమూసింది. టీచర్ నిర్లక్ష్యం, రాక్షసత్వమే తమ బిడ్డ ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించింది. నిష్పాక్షిక విచారణ నిమిత్తం బాధ్యురాలైన టీచర్‌ను తక్షణమే బదిలీ చేశారు. పాఠశాలల్లో పిల్లలకు పరిమితికి మించిన శిక్షలు వేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సీఎన్‌జీ ఇంధనం నింపే పైపు పగిలి పెట్రోల్ పంపు కార్మికుడు మృతి

