Kalyan Banerjee: పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వైఖరిపై ఆ పార్టీ సీనియర్ ఎంపీ, న్యాయవాది కల్యాణ్ బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అభిషేక్ అహంకారపూరిత ప్రవర్తన వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో అవసరమైతే తాను తృణమూల్ కాంగ్రెస్‌ను వీడేందుకు కూడా వెనుకాడబోనని సంచలన ప్రకటన చేశారు.

న్యాయపరమైన వ్యవహారంలో అవమానం.. కల్యాణ్ బెనర్జీ ఆవేదన
ఒక న్యాయపరమైన కేసు విషయంలో తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తనను పక్కన పెట్టడంపై కల్యాణ్ బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఆ కేసుపై కోర్టులో వాదనలు వినిపించేందుకు నేను రాత్రి వరకు కష్టపడి సిద్ధమయ్యాను. కానీ, చివరి నిమిషంలో నా సేవలు అవసరం లేదంటూ మరొక న్యాయవాదితో పిటిషన్ వేయించారు. కనీసం ఆ విషయాన్ని కూడా నాకు ముందే చెప్పలేదు. నా దగ్గర జూనియర్లుగా పనిచేసిన వారిని నా స్థానంలో నియమించి నన్ను తీవ్రంగా అవమానించారు. ఒక సీనియర్ న్యాయవాదికి పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా?” అని ఆయన నిలదీశారు.
Read also: Opendoor Lays Offs: భారతీయ ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్
Kalyan Banerjee: తనను తాను రాజులా భావిస్తున్నారు.. మమతకు అల్టిమేటం!
అభిషేక్ బెనర్జీ పార్టీలో తనను తాను ఒక రాజులా భావిస్తున్నారని కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తానే మమతా బెనర్జీకి అండగా నిలిచానని గుర్తు చేశారు. “నేను ఇప్పటికీ మమతా బెనర్జీ నాయకత్వాన్ని గౌరవిస్తాను, ఆమె వెంటే ఉంటాను. కానీ, అభిషేక్ బెనర్జీ లేకపోతే పార్టీ నడవదు అని మమత భావిస్తే మాత్రం.. నేను ఈ పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధం” అని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తక్షణమే జోక్యం చేసుకుని తుది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
మీనాక్షి నటరాజన్ నామినేషన్ కేసు.. రేపు సుప్రీంకోర్టులో కీలక విచారణ!

