Dailyhunt
టీఎంసీదే అధికారం: మమతా బెనర్జీ ధీమా

టీఎంసీదే అధికారం: మమతా బెనర్జీ ధీమా

వార్త 1 week ago

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నమోదైన భారీ పోలింగ్ శాతాన్ని చూస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్పష్టమైన ఆధిక్యంలో ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

కోల్‌కతాలోని చౌరంగీలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ.. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని, తాము ఇప్పటికే “డ్రైవర్ సీటు”లో కూర్చున్నామని వ్యాఖ్యానించారు. తమ హక్కులను కాపాడుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని ఆమె ప్రశంసించారు.

Read Also:Ambulance misuse : అంబులెన్స్‌లో రొమాన్స్.. షాకింగ్ ఘటన బయటపడింది

మోదీ, అమిత్ షా లక్ష్యంగా విమర్శలు

ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించడాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. పోలింగ్ రోజే గెలుపుపై అంచనాలు వేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె మండిపడ్డారు. ప్రజల తీర్పు వెలువడకముందే విజయం గురించి మాట్లాడటం ప్రజలను అవమానించడమేనని ఆమె మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 Mamata Banerjee Election Campaign

Mamata Banerjee: రాష్ట్ర యంత్రాంగంపై ఒత్తిడి: మమతా ఆరోపణలు

అమిత్ షా పర్యటనను లక్ష్యంగా చేసుకున్న మమతా.. క్షేత్రస్థాయిలో బీజేపీకి కార్యకర్తలు లేరని, అందుకే అమిత్ షా వంటి నేతలు ఇక్కడ ఉండి అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓటు హక్కు లేని నేతలు ఎక్కువ కాలం ఇక్కడ ఉండటం వెనుక కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అభివృద్ధి అనేది కేవలం ధనికులకు మాత్రమే కాదని, అందరికీ అందాలని తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె పునరుద్ఘాటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మాజీ నేవీ అధికారి పూర్ణేందు తివారీకి ఖతార్ కోర్టు శిక్ష! అసలేం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha