BCCI New Fitness Policy: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆటగాళ్ల ఎంపిక మరియు ఫిట్‌నెస్ విషయంలో అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించడం ప్రారంభించింది.
గాయపడిన ఆటగాళ్ల నిర్వహణపై ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టింది. ఇకపై ఒక ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేయాలంటే అతని ఫిట్‌నెస్‌పై 100 శాతం కాదు, ఏకంగా 200 శాతం నమ్మకం ఉంటేనే తుది నిర్ణయం తీసుకోవాలని పాలసీని మార్చింది. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఈ కొత్త విధానం స్పష్టంగా కనిపించింది.
Read Also :IPL 2027 : MIలోనే పాండ్య.. కెప్టెన్సీ రేసులో తిలక్, బుమ్రా..!

BCCI New Fitness Policy: కొత్త విధానం & ప్రధానాంశాలు
ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్ల పేర్ల పక్కన ఒక ఆస్టరిస్క్ (*) గుర్తును చేర్చారు. దీని అర్థం, వారి ఎంపిక వారి పూర్తి ఫిట్‌నెస్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుందని అర్థం.ఎంపిక వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యమని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ వివరించారు. ఒకవేళ ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైతే, వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై సెలక్టర్లకు ముందుగానే స్పష్టత ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ సిరీస్‌లకు 3-4 వారాల ముందే జట్లను ఎంపిక చేస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా చెప్పారు. మ్యాచ్‌ల సమయానికి కోలుకునే అవకాశం ఉన్నందున ప్లేయర్లను పూర్తిగా తిరస్కరించకుండా ఫిట్‌నెస్‌కు లోబడి (*) ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరిగే తొలి మ్యాచ్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని అంచనా. అయితే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్‌ల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సీఓఈ సిద్ధంగా లేదు.
ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. ప్లేయర్‌గానా లేక సీఎస్కే మెంటార్‌గానా?

