Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల భక్తులకు కీలక సూచన.. బ్రహ్మోత్సవాల్లో పలు సేవలు రద్దు

తిరుమల భక్తులకు కీలక సూచన.. బ్రహ్మోత్సవాల్లో పలు సేవలు రద్దు

వార్త 3 months ago

Tirumala: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు ముందస్తు సమాచారం అందించింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి విచ్చేసే లక్షలాది మంది సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

నిలిచిపోనున్న ఆర్జిత సేవలు ఇవే

టీటీడీ మార్గదర్శకాల ప్రకారం, బ్రహ్మోత్సవాల సమయంలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, తిరుప్పావడ, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, మరియు ప్రత్యేక దాతల కోసం కేటాయించే ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. భక్తుల సౌలభ్యం కోసం తీసుకున్న ఈ మార్పులను గమనించి, టీటీడీ అధికారులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Tirumala: సామాన్య భక్తులకే అత్యధిక ప్రాధాన్యత

ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విపరీతమైన రద్దీ ఉంటుంది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారికి త్వరితగతిన ఎక్కువ సమయం దర్శనం కల్పించేందుకే టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ తొమ్మిది రోజుల పాటు శ్రీవారి రోజువారీ వాహన సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తదనుగుణంగా తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం కోరింది.

Epaper: epaper.vaartha.com

ఏపీ ప్రజలకు తీపి కబురు.. త్వరలోనే తక్కువ ధరకే కందిపప్పు, వంట నూనెలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha