ED Raids: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా బుధవారం భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది.
మొత్తం 6 రాష్ట్రాల్లోని 15 వేర్వేరు ప్రాంతాలలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు, రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
Tirupati Laddu Controversy
Read also:Nellore Palle Veekshana Programme:నెల్లూరు జిల్లాలో 'పల్లె వీక్షణ' గర్జన..30 రోజుల డెడ్‌లైన్!
ఆరు రాష్ట్రాల్లో ఈడీ గురి.. ఎక్కడెక్కడంటే?
మనీలాండరింగ్ లింకుల ఆధారంగా ఈడీ బృందాలు దేశంలోని ప్రధాన నగరాలపై నజర్ పెట్టాయి. మహారాష్ట్రలోని ముంబై, అహిల్యనగర్‌లతో పాటు రాజస్థాన్‌లోని బికనీర్, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, రూర్కీ, తమిళనాడులోని దిండిగల్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మరియు దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి.
ED Raids: PMLA కింద కేసు నమోదు
గతంలో నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR) ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ప్రధానంగా ‘ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్’తో పాటు మరికొందరిని నిందితులుగా చేరుస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది.
అధికారులతో కుమ్మక్కై భారీ అక్రమాలు!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీకి కొందరు నిందితులు టీటీడీ (TTD) అధికారులతో చేతులు కలిపి, నాణ్యతా ప్రమాణాలు లేని కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ సరఫరా కారణంగా తిరుమల దేవస్థానానికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
హవాలా, స్థిరాస్తులపైనే ఈడీ నజర్
గతంలో ఈ వ్యవహారంపై సీబీఐ పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరిపి, టెండర్ల కేటాయింపులు మరియు సరఫరాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. అయితే, తాజాగా రంగంలోకి దిగిన ఈడీ.. ఈ కుంభకోణం వెనుక జరిగిన హవాలా లావాదేవీలు, అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన స్థిరాస్తుల (Real Estate) వివరాలను సేకరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
శ్రీకాకుళం యువతులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బంపర్ ఆఫర్!

