Tirumala TTD Re Entry: టి టి డివిప్లవాత్మక నిర్ణయం: సర్వదర్శనం భక్తులకు 'రీ ఎంట్రీ' సౌకర్యం.తిరుమలలో స్వామివారి ,సర్వదర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండలేక ఇబ్బంది పడే భక్తుల కోసం టి టి డి అధికారులు సరికొత్త 'రీ ఎంట్రీ' విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
రీ ఎంట్రీ ప్రాసెస్ ఇదే:
- స్టెప్ 1: వైకుంఠం-2 కాంప్లెక్స్‌లో ఆధార్ కార్డ్ సమర్పించి ‘రీ ఎంట్రీ టోకెన్’ పొందాలి.
- స్టెప్ 2: 17వ కంపార్ట్‌మెంట్ వద్ద ఉన్న ప్రత్యేక సెంటర్ లో టోకెన్ స్కాన్ చేసి బయటకు రావాలి.
- స్టెప్ 3: టోకెన్ పై ఉన్న దర్శన సమయం లోపు భక్తులు గదులకు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు.
- స్టెప్ 4: కేటాయించిన సమయానికి 20 నిమిషాల ముందే తిరుమల మ్యూజియం వద్ద గల W-4 గేట్ ద్వారా తిరిగి క్యూలైన్ లోకి ప్రవేశించవచ్చు.
- లాభం: ఈ గేట్ ద్వారా వెళ్తే కేవలం 2 నుండి 4 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది.
భక్తులు గమనించాల్సిన కండిషన్స్:
Tirumala TTD Re Entry: లగేజీ, మొబైల్ ఫోన్లను రూముల్లోనే పెట్టి రావాలి (W-4 గేట్ వద్ద కౌంటర్లు లేవు). రీ ఎంట్రీ టోకెన్ పోగొట్టుకుంటే దర్శనానికి అనుమతించరు. నిర్దేశిత సమయానికి ఆలస్యంగా వస్తే స్లాట్ రద్దవుతుంది. వృద్ధులు, చిన్న పిల్లలతో ప్రయాణించే భక్తులకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
https://vaartha.com/telangana/sangareddy-news/sangareddy-telangana-state-formation-day-pulkal/718384/

