Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం.. ఆన్‌లైన్‌లో ఎలా కొనాలో తెలుసుకోండి!

తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం.. ఆన్‌లైన్‌లో ఎలా కొనాలో తెలుసుకోండి!

వార్త 3 months ago

TTD Srivari Vastram E Auction: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. తిరుమల ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను విక్రయించడానికి ప్రక్రియను ప్రారంభించబోతోంది.

ఈ ఆన్‌లైన్ ఈ-వేలం మే 21 నుండి జూన్ 2వ తేదీ వరకు చాలా పారదర్శకంగా సాగనుంది. స్వామివారికి సమర్పించిన పవిత్ర వస్త్రాలను సొంతం చేసుకోవాలని ఆశించే భక్తులు ఈ అవకాశాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Read also: CM Chandrababu: గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు

 TTD Srivari Vastrala E Auction 2026

ఈ-వేలంలో లభించే వస్త్రాల వివరాలు ఇవే

ఈ ప్రత్యేక వేలంపాటలో కొత్తవి, ఉపయోగించినవి, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలతో కలిపి మొత్తం 505 వస్త్రాల వరకు అందుబాటులో ఉంచారు. వీటిలో కాటన్ చీరలు, పట్టు వస్త్రాలు, బ్లౌజ్ పీసులు, ఉత్తరీయాలు, లుంగీలు, టర్కీ టవళ్లు, బెడ్‌షీట్లు, శాలువాలు, గొడుగులు లాంటి రకరకాల సామాగ్రి ఉన్నాయి. ఆసక్తి ఉన్న భక్తులు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org ద్వారా కూడా వేలంలో పాల్గొనే విధానాన్ని పరిశీలించవచ్చు.

TTD Srivari Vastram E Auction: నాణ్యమైన పట్టు వస్త్రాల సరఫరాకు సరికొత్త నిర్ణయం

గతంలో జరిగిన వస్త్రాల కొనుగోళ్లలో నాణ్యత లోపాలు ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో టీటీడీ పాలకమండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ కాంట్రాక్టర్లను పూర్తిగా పక్కనపెట్టి ప్రభుత్వ సంస్థలైన ఆప్కో, కో-ఆప్టెక్స్ నుంచే మేలిరకం వస్త్రాలను సేకరించాలని రూ. 44.20 కోట్లు కేటాయించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొనుగోలు చేసే ఈ నాణ్యమైన శాలువాలను, దుప్పట్లను శ్రీవారిని దర్శించుకుని వేద ఆశీర్వచనం తీసుకునే భక్తులకు బహుమతిగా అందజేస్తారు. దీనివల్ల భక్తులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన స్వామివారి ప్రసాద వస్త్రాలు అందనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha