Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్ నటుడు బాబూమోహన్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్ నటుడు బాబూమోహన్

వార్త 1 month ago

Babu Mohan: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అనుబంధ హాస్య నటుల సంఘం మాజీ అధ్యక్షుడు బాబూమోహన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.

ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.

41 ఏళ్ల ప్రస్థానం.. అంతా స్వామివారి కృపే!

ఆపద్బాంధవుడు ఆశీస్సుల వల్లే తాను సినీ పరిశ్రమలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించగలిగానని బాబూమోహన్ ఈ సందర్భంగా కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. అయితే, ఇన్నేళ్లుగా తిరుమల పర్యటనకు ఎందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్నకు స్పందిస్తూ.. “నా వల్ల తోటి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ తిరుమల రావడం తగ్గించాను” అని ఆయన వివరించారు.

Babu Mohan: చేతినిండా సినిమాలు.. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రంలో డ్యాన్స్!

తన ప్రస్తుత సినీ ప్రాజెక్ట్‌ల గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం తాను దాదాపు 15 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ఒక సినిమాలో తాను డ్యాన్స్ కూడా చేశానని ఆయన గుర్తుచేసుకున్నారు. “నా ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు, నా చివరి శ్వాస విడిచేంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను” అని బాబూమోహన్ తన నటనాభిలాషను చాటుకున్నారు.

వివాదంలో కంగన 'క్వీన్-2'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha