TTD Updates:వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ కనిపిస్తోంది. స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో కొండకు చేరుకుంటున్నారు.
ఆదివారం ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోగా క్యూలైన్లు బయటకు విస్తరించాయి. భక్తుల తాకిడి దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Read also: Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పెరిగిన చికెన్ ధరలు!
Crowds of devotees have increased in Tirumala.
దర్శన సమయాలు
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి కొంత సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు 15 నుండి 18 గంటల సమయం పడుతుండగా రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులకు 3 నుండి 5 గంటల సమయం పడుతోంది. శనివారం ఒక్కరోజే 92,010 మంది స్వామిని దర్శించుకున్నారు. 52,346 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
TTD Updates:హుండీ ఆదాయం
శ్రీవారి హుండీ ఆదాయం ఆదివారం నివేదిక ప్రకారం 3.76 కోట్ల రూపాయలుగా నమోదైంది. భక్తుల కోసం 4.43 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో సహకరించాలని టీటీడీ కోరుతోంది. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
Epaper: epaper.vaartha.com
హాస్టల్ విద్యార్థులకు శుభవార్త.. 6.5 లక్షల మందికి పెరగనున్న డైట్ ఛార్జీలు!

