Tirumala: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో కొండపై భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
సోమవారం జారీ చేయాల్సిన శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్లను నిలిపివేయడంతో పాటు, వీఐపీ సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

read also: Pawan Kalyan Condolences: భాగ్యరాజ్ మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం
క్యూలైన్లలో 1.5 లక్షల మంది.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అదనపు ఈవో!
శనివారం (జూన్ 27) టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి తిరుమలలోని క్యూలైన్లను స్వయంగా పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ నెలలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రతిరోజూ సగటున 80 వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. శనివారం నాటికే సుమారు 1.5 లక్షల మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారని, ఆదివారం కూడా ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
సామాన్య భక్తులకు త్వరితగతిన, సులభంగా శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.
Read hindi news : hindi.vaartha.com

