Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు

వార్త 2 weeks ago

Tirumala VIP Darshan: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఉత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్దడిని క్రమబద్ధీకరించేందుకు, అందరికీ సులభంగా స్వామివారి దర్శనం కల్పించే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాల రోజుల్లో పలు రకాల ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నెల 11 నుంచి 20 వరకు ప్రత్యేక దర్శనాల రద్దు మరియు ప్రొటోకాల్ నిబంధనలు

బ్రహ్మోత్సవాలు జరిగే ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రొటోకాల్‌ కలిగిన ప్రముఖులకు మినహా మిగతా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలతో పాటు, వృద్ధులు, దివ్యాంగులు, అలాగే చంటి పిల్లల తల్లిదండ్రుల కోసం కేటాయించే ప్రత్యేక దర్శనాలను కూడా ఈ పది రోజుల పాటు పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించింది.

Tirumala VIP Darshan: ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ దర్శనాలు బంద్

సామాన్య భక్తులకు పెద్దపీట వేసే క్రమంలోనే ఎన్‌ఆర్‌ఐ (NRI) మరియు డిఫెన్స్ సిబ్బందికి సంబంధించిన ప్రత్యేక దర్శనాలను కూడా ఈ సమయంలో నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ బ్రహ్మోత్సవాల కాలానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) ఆన్‌లైన్ టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ యాత్రను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

Epaper: epaper.vaartha.com

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 6 గంటల సమయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha