Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో కొత్త నందకం యాప్ అందుబాటులోకి!

తిరుమలలో కొత్త నందకం యాప్ అందుబాటులోకి!

వార్త 1 month ago

Nandakam App: శ్రావణ మాస పూజలు మరియు వరుస సెలవుల నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతుండటంతో, క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. వచ్చే నెల 15వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, శ్రీవారి దర్శనం, వసతి మరియు పారిశుద్ధ్య నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు.

Read Also :Yadadri Temple : 26 కీలక అంశాలకు ఆమోదం తెలిపిన యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు

పారిశుద్ధ్య పర్యవేక్షణకు కొత్తగా ‘నందకం’ యాప్ (Nandakam App)

తిరుమలను మరింత స్వచ్ఛంగా, పవిత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ‘నందకం’ (Nandakam) అనే ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఈ యాప్ ద్వారా తిరుమల కొండపై ఎక్కడైనా చెత్త లేదా పారిశుద్ధ్య సమస్యలు ఉంటే భక్తులు లేదా సిబ్బంది రియల్ టైమ్‌లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఫిర్యాదు నమోదైన వెంటనే సంబంధిత ఏజెన్సీ సిబ్బందికి సమాచారం వెళ్లి, సమస్య తక్షణమే పరిష్కారమయ్యేలా సిస్టమ్‌ను డిజైన్ చేస్తున్నారు. వచ్చే నెల బ్రహ్మోత్సవాల నాటికి ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు.

Nandakam App: ఘాట్ రోడ్లు, కాలినడక మార్గాల్లోనూ స్వచ్ఛత

కేవలం తిరుమల మాడ వీధులు, కాంప్లెక్స్‌ల పరిధిలోనే కాకుండా ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు, అలిపిరి కాలినడక మార్గాలు మరియు పరిసర ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో భక్తులు కూడా భాగస్వాములై సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్ల నిధులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha