Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

వార్త 1 week ago

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల తాకిడి పెరగడంతో క్యూలైన్లలో రద్దీ హెచ్చింది.

ప్రస్తుతం సాధారణ సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులు క్యూలో వేచి ఉండాల్సి వస్తుండగా, దర్శనం పూర్తి కావడానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా క్యూ కాంప్లెక్స్‌లు కిక్కిరిసిపోయాయి.

శిలాతోరణం వరకు బారులు తీరిన భక్తులు

భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి క్యూలైన్ల నిడివ్వే నిదర్శనంగా నిలుస్తోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం బారులు తీరిన భక్తులు ఏకంగా శిలాతోరణం ప్రాంతం వరకు క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు తాగునీరు, అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Tirumala: భారీగా వచ్చిన హుండీ ఆదాయం మరియు తలనీలాలు

నిన్న సోమవారం ఒక్కరోజే తిరుమల శ్రీవారిని అపార భక్తిశ్రద్ధలతో మొత్తం 69,440 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే, నిన్న ఒక్కరోజే 36,255 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి స్వామివారికి తమ భక్తిని చాటుకున్నారు.

తిరుమల మాడ వీధులకు కొత్త పేర్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha