Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతిలో ఘంటసాల స్మరణ.. ప్రతి నెల నివాళి కార్యక్రమం

తిరుపతిలో ఘంటసాల స్మరణ.. ప్రతి నెల నివాళి కార్యక్రమం

వార్త 2 months ago

Ghantasala statue tribute: తమ అభిమాన గాయకున్ని స్మరించుకుంటూ ఆయన అభిమానులు ప్రతి నెల ఒకటవ తారీఖున ఆయన విగ్రహానికి మంచినీటితో శుద్ధి చేసి పుష్పాంజలతో నివాళి అర్పిస్తున్నారు.

తిరుపతిలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఆయన స్మరించుకుంటూ స్థానిక వివి మహల్ రోడ్ లోని ఆయన విగ్రహానికి ప్రతి నెల ఒకటో తారీఖున మంచినీటితో శుద్ధిచేసి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు అందులో భాగంగా నేడు రాయలసీమ రంగస్థలి సభ్యులు ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు.

Read also: Polavaram : 'పోలవరం' రైతుల అకౌంట్లోకి డబ్బులు

అనంతరం ఘంటసాల అభిమానులు డాక్టర్ సోము ఉమాపతి డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం లను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన ఘంటసాల ను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ సభ్యులుతొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం , పోలే జనార్దన్ రెడ్డి రామకృష్ణారెడ్డి టీచర్ తిరుమలయ్య ఆర్ ఎం ఎస్ భాస్కర్ గాయకులు పద్మనాభం పురోహితుడు సురేష్ స్వామి ఆది గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha