Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతిలో ఉద్రిక్తత.. భూమన ఇంటి ముట్టడికి స్వామీజీల యత్నం

తిరుపతిలో ఉద్రిక్తత.. భూమన ఇంటి ముట్టడికి స్వామీజీల యత్నం

వార్త 12 hrs ago

Bhumana Karunakar Reddy: తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు సాధు సంతు పరిషత్ స్వామీజీలు ప్రయత్నించారు.

శిల్పారామం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న స్వామీజీలు భూమన నివాసం వైపు ర్యాలీగా కదిలారు. భూమన వ్యాఖ్యలు టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు.

Read also: Summer Holidays 2026: మే 31తో ముగియనున్న వేసవి సెలవులు!

 Bhuma Karunakar Reddy’s House Besieged in Tirupati

Bhumana Karunakar Reddy: ఆరోపణల వెనుక కారణం

టీటీడీ పరిపాలన, తిరుమల పవిత్రతపై భూమన చేసిన విమర్శలే ఈ గొడవకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అలిపిరి పరిసరాల్లోని శనీశ్వరుడి విగ్రహాన్ని మరోలా చిత్రీకరిస్తూ భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్వామీజీలు మండిపడ్డారు. భక్తి విషయంలో రాజకీయాలను దూరం ఉంచాలని, వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దని స్వామీజీలు ఘాటుగా హెచ్చరించారు. ఈ పరిణామాలు ప్రస్తుతం తిరుపతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha