Nashik TCS Nida Khan Case: నాసిక్ టీసీఎస్ (TCS) వివాదంలో నిందితురాలి తల్లిదండ్రులు చేసిన సంచలన ఆరోపణలతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ తల్లిదండ్రులు శుక్రవారం మీడియా ముందు తమ వాదనను వినిపించారు.
తమ కుమార్తెపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, ఇదంతా ఒక పెద్ద కుట్రలో భాగమని వారు స్పష్టం చేశారు.
Read also: Anudeep Arrested: పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు… అనుదీప్ అరెస్ట్
Nashik TCS Nida Khan Case: Shocking facts come to light in TCS controversy
నిదా ఖాన్ ప్రస్తుతం గర్భవతి
ముఖ్యంగా నిదా ఖాన్ ప్రస్తుతం గర్భవతి అని, అటువంటి స్థితిలో ఉన్న ఆమెను తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిక్‌కు చెందిన దొంగ బాబాగా ముద్రపడిన అశోక్ ఖరత్‌పై ఉన్న అత్యాచార ఆరోపణల నుంచి అతడిని కాపాడటానికే తమ కుమార్తెపై రాజకీయ ప్రేరేపిత కేసులు బనాయించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిదా ఖాన్‌ను బలిపశువును చేసి అసలు నేరగాళ్లను రక్షించాలని చూస్తున్నారని వారు వాపోయారు.
మరోవైపు ఈ వివాదంపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ కీలక స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో నిదా ఖాన్‌ను ‘హెచ్ఆర్ మేనేజర్’గా పేర్కొనడంపై సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమె కంపెనీలో కేవలం ‘ప్రాసెస్ అసోసియేట్’ మాత్రమేనని తెలిపింది. బలవంతపు మతమార్పిడులు, ఉద్యోగులను వేధించినట్లు ఇప్పటికే ఆమెపై కేసులు నమోదైన నేపథ్యంలో, తల్లిదండ్రుల తాజా ఆరోపణలతో పోలీసులు దర్యాప్తును అన్ని కోణాల్లో వేగవంతం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ నిజాలు.. సొంత ఇళ్లలోనే బాంబుల తయారీ!

