Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

వార్త 2 weeks ago

TTD ACB Raids: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

ఆయన ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే తీవ్ర ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల సమయంలో డిప్యూటీ ఈవో లోకనాథం తన నివాసంలోనే ఉన్నారు.

Read Also:ISRO Chairman Narayanan: తిరుమలలో ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ప్రత్యేక పూజలు

TTD ACB Raids: సోదాల వివరాలు & ముఖ్యాంశాలు

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు బుధవారం ఉదయం 6 గంటల నుంచే ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. తిరుపతిలోని పెదకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసంతో పాటు, తిరుమలలోని ఆయన వసతిగృహం, తిరుపతిలోని ఇద్దరు బావమరుదుల ఇళ్లు, ఏర్పేడు మండలం చెల్లూరులోని సోదరుడి నివాసం, ఇతర బంధువుల ఇళ్లలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లోని లోకనాథం ఖాతాలకు సంబంధించిన లాకర్లను కూడా ఏసీబీ బృందాలు తెరిచి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గతంలో 2011లో నాటి టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒక టీటీడీ ఉన్నతాధికారి నివాసంలో ఏసీబీ సోదాలు జరగడం తిరుమలలో తీవ్ర సంచలనం సృష్టించింది.

Epaper: epaper.vaartha.com

సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha