Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీవీకే సర్కార్ బడ్జెట్‌లో అదిరిపోయే సంక్షేమ పథకాలు!

టీవీకే సర్కార్ బడ్జెట్‌లో అదిరిపోయే సంక్షేమ పథకాలు!

వార్త 1 day ago

TVK Government Budget 2026: తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం తన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను (2026-27) ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్.మారీ విల్సన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో విద్యారంగానికి అత్యున్నత ప్రాధాన్యం కల్పించారు.

పాఠశాల విద్య కోసమే ఏకంగా రూ.44,527 కోట్లు కేటాయించడం గమనార్హం.

Read Also:TVK Government Budget: నేడు టీవీకే తొలి బడ్జెట్: కొత్త పథకాల ప్రకటనపై భారీ అంచనాలు

విద్యారంగానికి లభించిన ప్రధాన నిధులు & పథకాలు

  • పెరుంతలైవర్ కామరాజర్ మోడల్ స్కూల్స్: 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ఆధునిక వసతులతో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు. ఇందులో ఉచిత విద్య, భోజనం, వసతి, యూనిఫాం, పుస్తకాలు అందిస్తారు. మౌలిక వసతుల కోసం రూ.125 కోట్లు కేటాయించారు.
  • వెట్రి ల్యాప్‌టాప్ పథకం: ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు రూ.2,000 కోట్లు ప్రతిపాదించారు.
  • సూపర్ క్లీన్.. సూపర్ క్యాంపస్: తొలి దశలో 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్య మెరుగుదలకు రూ.129 కోట్లు నిధులు మంజూరు చేశారు.
  • యాంటీ డ్రగ్ అవగాహన: విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించే కార్యక్రమాల కోసం రూ.7 కోట్లు కేటాయించారు.

TVK Government Budget 2026: ప్రధాన సంక్షేమ పథకాలు

  • నవజాత శిశువులకు బంగారు ఉంగరం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతీ శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే పథకానికి రూ.560 కోట్లు కేటాయించారు.
  • వివాహ కానుక (కళ్యాణ కానుక): పెళ్లి రోజే వధువుకు 8 గ్రాముల బంగారు నాణెం (తులం బంగారం) మరియు పట్టు చీర అందించే పథకానికి రూ.812 కోట్లు ప్రతిపాదించారు.

అదనంగా, గత ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు రెట్టింపు అయ్యాయని ఆర్థిక మంత్రి పేర్కొంటూ, రాబోయే ఏడాదిలో రూ.16,000 కోట్ల అదనపు ఆదాయం సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Epaper: epaper.vaartha.com

ప్రధాని వీడియో వివాదంపై పార్లమెంటరీ కమిటీ సీరియస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha