తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు డీఎంకేకు షాక్ ఇస్తూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) వైపు మొగ్గు చూపడం తీవ్ర చర్చకు దారితీసింది.
కాంగ్రెస్ నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై మాట్లాడుతూ, కాంగ్రెస్ ఒక “అవిశ్వసనీయ భాగస్వామి” అని ధ్వజమెత్తారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని చెబుతూనే, క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ పరిణామం ఇండీ (INDIA) కూటమిలోని ఇతర నేతలైన అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే వంటి వారిలో కూడా అభద్రతా భావాన్ని కలిగిస్తుందని డీఎంకే హెచ్చరించింది.
Read Also: Tamilnadu : మద్దతు కావాలంటే మంత్రి పదవులు ఇవ్వాల్సిందే..TVK కు కాంగ్రెస్ కండిషన్
Tamilnadu Election Results:
Tamilnadu Election Results: టీవీకేకు మద్దతు వెనుక కాంగ్రెస్ వ్యూహం
తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిన విజయ్ పార్టీకి కాంగ్రెస్ తన 8 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం తమిళనాడులో పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే విజయ్‌కు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ సమర్థించుకుంటోంది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) విజయ్‌తో చేతులు కలపడానికి మొగ్గు చూపింది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి రాహుల్ గాంధీ స్వయంగా హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే, తమిళనాడులో ద్రవిడ రాజకీయాల వారసత్వం డీఎంకే నుంచి టీవీకే వైపు మళ్లుతుందనే సంకేతాలు వెలువడవచ్చు. ఈ పరిణామాలతో తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధం ముగింపు దశకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

