Mancherial Crime: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. కుటుంబ కలహాలు తాళలేక ఓ తల్లి తన ఆరు సంవత్సరాల కుమార్తెను నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Read Also :Periyapalayam Accident: లారీని ఢీకొట్టిన ఆటో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి!
ఘటన వివరాలు
లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత (26/28)కు, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్య (అంజన్న)తో వివాహమైంది. వీరికి కుమార్తె అక్షిత (6), 18 నెలల కుమారుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో రజిత తన పుట్టింటిలోనే నివాసముంటోంది. ఆదివారం ఉదయం భర్త అంజయ్య వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే, రజిత తన చిన్న కుమారుడిని ఇంట్లోనే వదిలేసి, కుమార్తె అక్షితను వెంటబెట్టుకుని సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. చిన్నారిని తన నడుముకు గట్టిగా కట్టుకుని ఒక్కసారిగా బావిలోకి దూకింది.

Mancherial Crime: పోలీసుల దర్యాప్తు
బావిలో మృతదేహాలు తేలియాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దండేపల్లి ఎస్‌ఐ రాజ్‌వర్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది.

