Supreme Court on Bengal Counting: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు (మే 4) కొన్ని గంటల ముందు తృణమూల్ కాంగ్రెస్‌కు (TMC) సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులను పర్యవేక్షకులుగా నియమించే ఈసీ (ECI) నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.
Read Also:Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టులో ఊరట
West Bengal Elections 2026
Supreme Court on Bengal Counting: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
శనివారం సెలవు దినమైనప్పటికీ అత్యవసరంగా విచారణ చేపట్టిన జస్టిస్ పి.ఎస్. నరసింహ, జయమల్య బాగ్చీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నిబంధనలకు విరుద్ధం కాదని స్పష్టం చేసింది. “కౌంటింగ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలన్న రూల్ ఏమీ లేదు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తే తప్పేంటి?” అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈసీ ఇప్పటికే జారీ చేసిన ఏప్రిల్ 13 సర్క్యులర్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేయడంతో, దీనికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది.
అసలేం జరిగింది?
ఈ నెల 4న జరిగనున్న ఎన్నికల కౌంటింగ్ లో కేంద్ర సిబ్బందిని ఎన్నికల సంఘం మైక్రో అబ్జర్వర్లుగా నియమించింది. కేంద్రం పరిధిలో పని చేసే వారిని మైక్రో అబ్జర్వర్లుగా నియమించటం పైన మమతా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. కాగా.. దీని పైన అత్యవసర విచారణ చేయాలని మమతా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ తరువాత సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మమతా దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించింది. కేంద్ర ఉద్యోగులు సైతం విధుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి విధులు నిర్వహిస్తారని.. వారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండవని కోర్టు అభిప్రాయ పడింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

