Today Rasi Phalalu : రాశి ఫలాలు - 26 జనవరి 2026

Today Rasi Phalalu : రాశి ఫలాలు - 26 జనవరి 2026

వార్త

వార్త

72d

Loading...

Today Rasi Phalalu : రాశి ఫలాలు - 26 జనవరి 2026

మేష రాశి

మేషం రాశివారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. వ్యక్తిగత, వ్యాపార సంబంధిత నిర్ణయాలు, ప్రాజెక్టులు లేదా కీలకమైన సమావేశాల్లో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి

వృషభం రాశివారికి ఈ రోజు ముఖ్యమైన సందర్భాలలో ప్రముఖులను కలుసుకోవడం ద్వారా, వ్యాపార, రాజకీయ లేదా వ్యక్తిగత సమస్యలపై చర్చలు జరగవచ్చు.

మిథున రాశి

మిథునం రాశివారికి ఈ రోజు ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పాత సమస్యలు, పొరపాట్లు సరిచేసి, లాభాలను పొందడం సులభం అవుతుంది.

కర్కాటక రాశి

కర్కాటకం రాశివారికి ఈ రోజు ఏ కార్యాన్నైనా పూర్తి దీక్ష మరియు పట్టుదలతో సాధించగల అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనులు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. సానుకూల దృక్పథంతో, కష్టాలను ఎదుర్కొని, ముందుకు సాగడం ద్వారా ప్రతి రంగంలో విజయాలను అందుకుంటారు.

సింహ రాశి

సింహం రాశివారికి ఈ రోజు చేపట్టిన పనులు సాఫీగా మరియు సులభంగా కొనసాగుతాయి. గతంలో వాయిదా పడిన ప్రాజెక్టులు లేదా అనుమానాస్పద కార్యాలు ఈ రోజు సజావుగా పూర్తి అవుతాయి.

కన్యా రాశి

కన్య రాశివారికి ఈ రోజు సంఘంలో మీ మాటకు మంచి విలువ పెరుగుతుంది. మీరు చెప్పే అభిప్రాయాలు, సూచనలు ఇతరులు గౌరవంతో స్వీకరిస్తారు. సమావేశాలు, చర్చలు లేదా సామాజిక కార్యక్రమాల్లో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

తులా రాశి

తుల రాశివారికి ఈ రోజు సన్నిహితులు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఈ సమాచారం మీ భవిష్యత్తు నిర్ణయాలకు మార్గదర్శకంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

వృశ్చికం రాశివారికి ఈ రోజు పూర్తి స్వంత వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. గతంలో చేసిన పెట్టుబడులు లేదా వ్యాపార ప్రణాళికలు ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపిస్తాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారికి ఈ రోజు చర్మ సంబంధ సమస్యలు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం అవసరం. అలర్జీలు, దద్దుర్లు లేదా చర్మ సున్నితత్వం వంటి చిన్న సమస్యలు కూడా నిర్లక్ష్యం చేస్తే పెరిగే అవకాశం ఉంది.

మకర రాశి

మకరం రాశివారికి ఈ రోజు జీవితాశయాన్ని ఏ విధంగా అయినా సరే సాధించాలని గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు, ఆలస్యాలు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేవు.

కుంభ రాశి

కుంభం రాశివారికి ఈ రోజు మీ పరోక్షంలో జరుగుతున్న అన్ని పనులను కూడా జాగ్రత్తగా గమనిస్తూ కఠినంగా వ్యవహరిస్తారు. చిన్న విషయాలను కూడా వదలకుండా పరిశీలించడం వల్ల తప్పిదాలు తగ్గుతాయి.

మీన రాశి

మీనం రాశివారికి ఈ రోజు సౌందర్య చిట్కాలు, అలంకరణలు మరియు వ్యక్తిగత సంరక్షణ పట్ల ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది. మీ రూపురేఖలను మెరుగుపరచుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.

వారం - వర్జ్యం

తేది :26-01-2026,సోమవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మాఘమాసం , ఉత్తరాయణం శిశిర ఋతువు, శుక్లపక్షం శ్రావణ కార్తె

అష్టమి రా.9.15 అశ్విని మ.12.30వర్జ్యం:రా.9.33-11.03దు.ము :మ.12.43-1.28 , మ.2.59-3.44రాహుకాలం:ఉ.7.30 - 9.00

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha

Comments

5
Loading comments...