Bhogapuram Airport: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ నెల ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమాన సర్వీసులు (Commercial Flights) ప్రారంభం కానున్నాయని డెవలపర్ జీఎంఆర్ (GMR) గ్రూప్ శనివారం అధికారికంగా వెల్లడించింది.
ఈ సంవత్సరం దేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్న రెండవ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురం కావడం విశేషం (ఉత్తరప్రదేశ్‌లోని జెవార్ విమానాశ్రయం జూన్ 15న తన సర్వీసులను ప్రారంభించింది).
Read Also :Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్.. భూములిచ్చిన రైతులకు ఘన సత్కారం
ఆగస్టు 17న కమర్షియల్ ఫ్లైట్స్ షురూ
జిఎంఆర్ గ్రూప్ విడుదల చేసిన వివరాల ప్రకారం:
- షిెడ్యూల్ కంటే ముందే: ఈ విమానాశ్రయాన్ని నిర్ణీత గడువు కంటే చాలా నెలల ముందే నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు.
- ప్రయాణికుల సామర్థ్యం: ప్రాథమిక దశలో ఏడాదికి 60 లక్షల మంది (6 Million) ప్రయాణికులను చేరవేసే సామర్థ్యంతో ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 4 కోట్లకు (40 Million) పెంచనున్నారు.
- పీపీపీ నమూనా: జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GVIAL) పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో DBFOT (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ మరియు ట్రాన్స్‌ఫర్) ప్రాతిపదికన ఈ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసింది.
దీనితో పాటు ఎయిర్‌సైడ్ మౌలిక వసతులు, వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాలు మరియు అనుసంధాన రహదారులను ఏర్పాటు చేశారు.

Bhogapuram Airport: తూర్పు ప్రాంతానికి ప్రధాన ద్వారం (Gateway to Eastern Corridor)
హైదరాబాద్, గోవా తరువాత జీఎంఆర్ గ్రూప్ అభివృద్ధి చేసిన మూడవ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురం కావడం గమనార్హం. “భారతదేశ తూర్పు కారిడార్‌కు ఈ విమానాశ్రయం ఒక ప్రధాన ద్వారంగా (Gateway) మారుతుందని, రాబోయే దశాబ్దాల్లో వ్యాపార పెట్టుబడులు, ఉపాధి కల్పన మరియు ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి ఇది కీలక చోదకశక్తిగా నిలుస్తుందని మేము విశ్వసిస్తున్నాం.” జి.బి.ఎస్. రాజు, బిజినెస్ ఛైర్మన్, జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని

