తెలుగు (Tollywood) సినీ పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ నటుడు రఘునాథరెడ్డి (Raghunatha Reddy) కన్నుమూశారు. శనివారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నెల రోజుల క్రితమే ఆయన కుమారుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో రఘునాథరెడ్డి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు..
Actor: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
మరణం పై సంతాపం
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 370 కి పైగా సినిమాలలో నటించిన రఘునాథ్ రెడ్డి ఇకలేరనే వార్త తెలుగు చిత్ర పరిశ్రమను ఎంతగానో కృంగదీస్తోంది. ఈయన కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ బోజ్ పురి సినిమాలలో కూడా నటించినటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇక బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి రఘునాథ్ రెడ్డి బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.

ఇలా వందల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఈయన మరణ వార్త తెలిసిన అభిమానులు తోటి నటీనటులు షాక్ అవుతూ ఈయన మరణం పై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Singeetam Srinivasa Rao: 94 ఏళ్ల వయసులో సినిమా డైరెక్ట్ చేయనున్న సింగీతం శ్రీనివాసరావు

