Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు..14 ప్రాంతాల్లో తనిఖీలు

ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు..14 ప్రాంతాల్లో తనిఖీలు

వార్త 2 months ago

ACB Raids: తెలంగాణ ట్రాన్స్‌కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈ)గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణను లక్ష్యంగా చేసుకుని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించారు.

ఆయన తన పరిమితికి మించి అక్రమ ఆస్తులను కూడబెట్టారనే బలమైన ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే విస్తృత సోదాలు చేపట్టారు.

14 ప్రాంతాల్లో ఏకకాలంలో 8 ఏసీబీ బృందాల సోదాలు

ఈ తనిఖీల కోసం ఏసీబీకి చెందిన ఎనిమిది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, మొత్తం 14 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న మీనాక్షి స్కై లాంజ్‌లోని వెంకటరమణ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లు, ఇతర కార్యాలయాల్లో అధికారులు అణువణువునా తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అందిన పక్కా సమాచారంతోనే ఈ రైడ్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ACB Raids: స్వాధీనం చేసుకుంటున్న ఆస్తి పత్రాలు, బ్యాంకు వివరాలు

సోదాల సందర్భంగా అధికారులు కీలకమైన స్థిరాస్తి పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తిగా ముగిసిన తర్వాత పట్టుబడిన నగదు, ఆభరణాలు మరియు గుర్తించిన మొత్తం ఆస్తుల విలువకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. విద్యుత్ శాఖలో కీలకమైన అధికారిపై జరిగిన ఈ హఠాత్ దాడి రాష్ట్రస్థాయిలో తీవ్ర కలకలం రేపింది.

హైదరాబాద్‌లో కరోనా కలకలం..వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు క్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha