Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రావిస్ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వని కోహ్లీ!

ట్రావిస్ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వని కోహ్లీ!

వార్త 3 months ago

Virat Kohli Travis Head Handshake: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు మ్యాచ్‌లో హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అయితే, ఈ మ్యాచ్ ఫలితం కంటే మైదానంలో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ఆన్-ఫీల్డ్ స్లెడ్జింగ్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు సాంప్రదాయబద్ధంగా చేతులు కలుపుకుంటున్న సమయంలో, కోహ్లీ ఉద్దేశపూర్వకంగా హెడ్‌ను విస్మరించడం కెమెరాలకు చిక్కడం తీవ్ర సంచలనంగా మారింది.

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిశాక హై డ్రామా!

 RCB vs SRH IPL 2026

ఈ వివాదానికి బీజం ఆర్‌సీబీ బ్యాటింగ్ సమయంలో పడింది. బెంగళూరు జట్టు 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఉన్నప్పుడు కోహ్లీ, హెడ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అంతకుముందు ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ సమయంలో హెడ్ అవుటైనప్పుడు కోహ్లీ చాలా అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకోగా, ఆ పగను మనసులో ఉంచుకున్న హెడ్.. కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు పెద్ద షాట్లు ఆడాలంటూ కవ్వించాడు. దీనికి కోహ్లీ స్పందిస్తూ, “నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్‌గా సబ్‌స్టిట్యూట్ అవ్వవు కదా, ధైర్యముంటే వచ్చి బౌలింగ్ చెయ్” అంటూ తీవ్రంగా సవాల్ విసిరాడు. అయితే, కోహ్లీ కేవలం 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కోహ్లీ పెవిలియన్‌కు నడుస్తుండగా హెడ్ వెనక నుంచి గట్టిగా కౌంటర్ ఇస్తూ, “మిత్రమా.. నేను బౌలింగ్‌కు రాకముందే నువ్వు అవుటైపోయావ్!” అంటూ ఎగతాళి చేయడం కోహ్లీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

Virat Kohli Travis Head Handshake: సంచలనంగా మారిన ‘నో హ్యాండ్‌షేక్’

ఈ మైదాన మైండ్ గేమ్స్ కాస్తా మ్యాచ్ ముగిసిన తర్వాత 'నో హ్యాండ్‌షేక్' వివాదానికి దారితీశాయి. సన్‌రైజర్స్ విజయం సాధించిన అనంతరం ఇరు జట్లూ లైన్ లో నిలబడి షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకుంటున్న సమయంలో, ట్రావిస్ హెడ్ కోహ్లీ వైపు చేయి చాచాడు. కానీ, కోహ్లీ అతని వైపు కనీసం చూడకుండా, చేతిని పూర్తిగా విస్మరించి ముందుకు సాగిపోయాడు. అదే సమయంలో హెడ్ పక్కనే ఉన్న ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లను కోహ్లీ ఆత్మీయంగా పలకరిస్తూ హ్యాండ్‌షేక్ ఇవ్వడం గమనార్హం. ఈ వివాదం ముదిరిన కాసేపటికే ట్రావిస్ హెడ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “కీప్ ది బాడీ గెస్సింగ్” (Keep the body guessing) అంటూ ఒక నిగూఢమైన క్యాప్షన్‌తో ఫోటోను పంచుకున్నాడు. ఇది కోహ్లీ తనను ఇగ్నోర్ చేసిన విధానానికి కౌంటర్‌గానే హెడ్ పోస్ట్ చేశాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫైయర్-1 కు చేరింది. అయితే ఈ ఘర్షణపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ, మైదానంలో దూకుడు సహజమే కానీ మ్యాచ్ ముగిసాక అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

క్లాసెన్, అభిషేక్, ఇషాన్ సరికొత్త రికార్డు.. హిస్టరీలో సెకండ్ టైమ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha