Uday Krishna Reddy: తనతోపాటు శిక్షణ పొందుతున్న తోటి మహిళా అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టును కోరగా, వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.

కేసుకు సంబంధించిన నేపథ్యం
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించిన ఉదయ్ కృష్ణారెడ్డి, 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో, తనతో పాటు శిక్షణ తీసుకుంటున్న ఓ మహిళా అధికారిని ఆయన వేధించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులతో పాటు ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
Uday Krishna Reddy: తీవ్రమైన వేధింపుల ఆరోపణలు
బాధితురాలు వేరొకరిని వివాహం చేసుకోవడంతో, వారిద్దరి మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణలను (చాట్స్) బయటపెడతానని ఉదయ్ కృష్ణారెడ్డి బెదిరించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. 2023లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరికి, అకాడమీలో శిక్షణ సమయంలో మనస్పర్థలు వచ్చాయి. తరచూ గొడవలకు దిగడం, ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పాటు ఆయుధాలు చూపి భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇంటర్ కాలేజీల ఫోర్జరీ కేసులో సంచలనం.. ఫైర్ డీజీ సంతకాలు కూడా నకిలీ

