Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం!

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం!

వార్త 2 weeks ago

Trainee IPS Uday Krishna: హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.

తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, తీవ్ర వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Trainee IPS Uday Krishna Reddy) ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Read Also:Mumbai Car Tanker Crash: ఇథనాల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టిన కారు.. ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం!

మహిళా ఐపీఎస్ అధికారిణికి లైంగిక వేధింపులు

కర్ణాటక రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల వివాహిత, ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణ ఉదంతం బయటపడింది. ఉదయ్ కృష్ణారెడ్డి తనకు నిరంతరం అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధించేవాడని, అంతేకాకుండా బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి, జుట్టు పట్టుకుని గొంతు నులిమి మెడపై కత్తిపెట్టి తీవ్ర బెదిరింపులకు దిగాడని బాధితురాలు పేర్కొన్నారు. బాధితురాలి ప్రైవేట్ వీడియోలను దొంగతనంగా రికార్డ్ చేసిన ఉదయ్, వాటిని ఆమె భర్తకు పంపి తీవ్ర స్థాయిలో మానసిక వేధింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌కు గురిచేసినట్లు ఫిర్యాదులో వివరించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కఠినమైన సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ (IT Act) కింద కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈ ఆరోపణలపై 8 రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఉదయ్‌కి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

Trainee IPS Uday Krishna: ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

కేసు నమోదై నోటీసులు వెళ్లిన క్రమంలో, మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. గమనించిన తోటి అధికారులు హుటాహుటిన ఎస్సార్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందనీ, వైద్యులు ఆయనను నిరంతర పర్యవేక్షణలో ఉంచారని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Epaper: epaper.vaartha.com

లక్నోలో4 ఏళ్ల చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అఘాయిత్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha