Dailyhunt
ట్రైనీ పైలెట్‌పై ఇన్‌స్ట్రక్టర్ అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్!

ట్రైనీ పైలెట్‌పై ఇన్‌స్ట్రక్టర్ అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్!

వార్త 1 week ago

Begumpet: సికింద్రాబాద్ బేగంపేటలోని 'ఏవికన్స్ పైలెట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్'లో పైలెట్ కోర్సు అభ్యసిస్తున్న ఒక యువతిపై అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నసిముద్దీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

జనవరి 2025 నుంచి శిక్షణ ఇస్తాననే సాకుతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బాధితురాలు ధైర్యం చేసి బేగంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ అరాచకం బయటపడింది.

Read Also:Marriage Before Suicide : పెళ్లికి 5 రోజులు.. యువకుడి ఆత్మహత్య కలకలం

Begumpet: మరో ఇన్‌స్ట్రక్టర్ సహకారం.. నిందితుడి అరెస్ట్

 Atrocity comes to light following a young woman’s complaint.

ఈ దారుణంలో నసిముద్దీన్‌కు దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్‌స్ట్రక్టర్ సల్మాన్ కూడా సహకరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ప్రధాన నిందితుడు నసిముద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రక్షణగా ఉండాల్సిన విద్యాసంస్థల్లోనే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పట్టపగలు తనిఖీ పేరుతో బంగారం షాపులో లూటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha