Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రైన్‌లో తలుపు విషయంలో గొడవ.. ప్రయాణికుడిని పొడిచి చంపిన దుండగుడు

ట్రైన్‌లో తలుపు విషయంలో గొడవ.. ప్రయాణికుడిని పొడిచి చంపిన దుండగుడు

వార్త 1 week ago

Mumbai local train murder: ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో అత్యంత ఆందోళనకరమైన ఘటన వెలుగుచూసింది. ముంబై లైఫ్‌లైన్‌గా పిలిచే లోకల్ ట్రైన్‌లో ప్రయాణికుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది.

రైలు కోచ్ తలుపు (డోర్) తెరిచి ఉంచే విషయమై ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన సాధారణ వాగ్వాదం.. చివరికి ఒకరి ప్రాణాలను బలిగొంది.

Read Also : Munger Ganga Ghat tragedy: పూజ కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు

 Dispute over train door: Assailant stabs passenger to death.

Mumbai local train murder: కడుపులో పొడవడంతో అక్కడికక్కడే మృతి

పోలీసుల కథనం ప్రకారం.. రైలు బోరివలీ స్టేషన్ వైపు వెళ్తుండగా కోచ్ డోర్ విషయమై ఇద్దరు ప్రయాణికుల మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో తోటి ప్రయాణికుడిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి, తన వద్ద ఉన్న పదునైన ఆయుధాన్ని తీసి మయాంక్ లోహర్ (22) అనే యువకుడి కడుపులో బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు యువకుడు రైలు డబ్బాలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోరాన్ని చూసి కోచ్‌లోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

బోరివలీ స్టేషన్‌లో నిందితుడు పరార్

దాడి చేసిన నిందితుడు, రైలు బోరివలీ స్టేషన్‌లో ఆగగానే ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) సిబ్బంది తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, స్టేషన్‌లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ముంబై లోకల్ ట్రైన్స్‌లో భద్రతపై ఈ ఘటన మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.

బెంగళూరులో ఘోరం: ప్రియుడి కోసం కన్నవారు, చెల్లిని చంపిన కూతురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha