Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రంప్ దాడుల హెచ్చరిక.. ఇరాన్ చేరిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్!

ట్రంప్ దాడుల హెచ్చరిక.. ఇరాన్ చేరిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్!

వార్త 3 days ago

Asim Munir Iran visit: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్ పర్యటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తున్న తరుణంలో ఆయన టెహ్రాన్ చేరుకున్నారు.

ఇరు దేశాల మధ్య కీలక విషయాలపై చర్చలు జరిపేందుకు ఈ పర్యటన ఖరారైంది. అమెరికా ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఈ భేటీ జరగడం గమనార్హం.

Read also: Breaking News: పుల్వామా దాడి సూత్రధారి హంజా బుర్హాన్ హతం: పీఓకేలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఖతం!

 Asim Munir Iran visit Trump warning

టెహ్రాన్‌లో పాక్ మంత్రుల కీలక సంప్రదింపులు

ఈ పర్యటనకు ముందే పాకిస్తాన్ హోం మంత్రి మోహ్సిన్ నఖ్వీ టెహ్రాన్ చేరుకున్నారు. ఆయన ఇరాన్ ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా తోడవడంతో చర్చలు మరింత వేగవంతం అయ్యాయి. ప్రాంతీయ రక్షణ, శాంతి భద్రతలపై ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.

Asim Munir Iran visit: డీల్ కుదరకపోతే దాడులు తప్పవన్న ట్రంప్

శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే దాడులు మళ్లీ మొదలుపెడతామని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో అసిమ్ మునీర్ పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎంతవరకు పనిచేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha