PM Modi on Trump Firing Incident: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న విందు కార్యక్రమంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విచారకర ఘటనను ఖండిస్తూ ఆయన ట్వీట్ చేసారు.”అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు క్షేమంగా, ఎలాంటి హాని జరగకుండా బయటపడ్డారని తెలిసి ఊరట చెందాను. వారి భద్రత, శ్రేయస్సు కోసం నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. దానిని నిస్సందేహంగా ఖండించాలి” అని పోస్ట్ చేశారు.
Read Also:Bulandshahr crime:కేక్ పూయడంపై గొడవ.. ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
PM Modi on Trump Firing Incident: హిల్టన్ హోటల్‌లో అసలేం జరిగింది?
వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్‌లో శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. అదే సమయంలో హోటల్ వద్ద తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో తీవ్ర కలకలం రేగింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రంప్ దంపతులతో పాటు ఉన్నతాధికారులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం విందును రద్దు చేశారు.
ప్రస్తుతం అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నాయి. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడినా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
దైవ బండార ఊరేగింపులో కూలిన వంతెన.. ఎనిమిది మందికి గాయాలు!

