Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టు బిగ్ షాక్

ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టు బిగ్ షాక్

వార్త 3 weeks ago

US Supreme Court : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయానికి యూఎస్ సుప్రీంకోర్టు గట్టి బ్రేక్ వేసింది. అమెరికాలో దశాబ్దాలుగా అమలులో ఉన్న 'బర్త్ రైట్ సిటిజన్‌షిప్' (పుట్టుకతో వచ్చే పౌరసత్వం) చట్టం యథాతథంగా కొనసాగాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ చట్టాన్ని రద్దు చేస్తూ గతంలో ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (కార్యనిర్వాహక ఉత్తర్వు) రాజ్యాంగబద్ధం కాదంటూ కోర్టు దానిని పూర్తిగా వ్యతిరేకించింది. అమెరికా భూభాగంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ సహజసిద్ధంగానే అక్కడి పౌరసత్వం లభిస్తుందని న్యాయస్థానం తన తీర్పులో పునరుద్ఘాటించింది. వలసదారులపై కఠిన వైఖరి ప్రదర్శించే ట్రంప్ వర్గానికి ఈ తీర్పు కోలుకోలేని పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

వలసదారులకు ఊరట.. అసలు ఏంటి ఈ ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’?

అమెరికా చట్టాల ప్రకారం, ఎవరైనా విదేశీయులు యూఎస్‌లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నా లేదా తాత్కాలిక వీసాలపై ఉంటున్నా.. వారికి అమెరికా గడ్డపై జన్మించే పిల్లలకు ఆటోమేటిక్‌గా పూర్తి స్థాయి అమెరికన్ పౌరసత్వం లభిస్తుంది. దీనినే ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్ యాక్ట్’ అంటారు. ఈ చట్టం వల్ల ఇతర దేశాల నుంచి వచ్చే వలసదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని, దీనిని దుర్వినియోగం చేస్తున్నారంటూ ట్రంప్ దీనిని రద్దు చేయాలని గట్టిగా ప్రయత్నించారు. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ముఖ్యంగా భారతీయులతో పాటు లక్షలాది మంది ఇతర దేశాల వలసదారులకు మరియు గర్భవతులకు పెద్ద ఊరట లభించినట్లయింది. అమెరికా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అంత తేలికగా మార్చలేరని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది.

ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం.. భారత ప్రతినిధులుగా వీరే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha